Ra Raja movie: ముఖాలు లేకుండా సినిమానా? అసలు సాధ్యమేనా? 1 y ago

featured-image

అసలు సినిమా అంటే ఏంటి? అందమైన తారలు.. సూపర్ గా ఉండే విజువల్స్.. నిజామా అనిపించేలా చేసే నటుల భావోద్వేగాలు ఇవి కదా అసలు సినిమాకు ప్రాణం పోసేది. అసలు ఇవేం లేకుండా సినిమా తెయ్యగలమా? సాధ్యమేనా? అవును సాధ్యమే నేను తీస్తా అంటున్నాడు యువ దర్శకుడు బి. శివప్రసాద్. "రా రాజా" అనే సినిమాలో నటీనటుల ముఖాలు చూపించకుండానే సినిమా చిత్రీకరించి ఒక కొత్త ప్రయోగాన్ని చేశాడు. ఇదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇది టాలీవుడ్ లోనే ఒక సంచలనాన్ని సృష్టిస్తుందని శివప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన సినిమా ప్రమోషన్ వేడుకలో అయన మాట్లాడుతూ "టైటిల్ చూసి ప్రేమ కథ అనుకుంటారు. కానీ సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.. హీరోలు, స్టార్లు లేకుండా సినిమా తీయొచ్చని నిరూపించాలనేది నా ఉద్దేశం" అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగం ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఇది సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఇది అసలు ఎలా ఉంటుందో తప్పకుండ చూడాల్సిందే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD